గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రేణు దేశాయ్
- కొన్నాళ్లుగా గుండె, ఇతర సమస్యలతో బాధ పడుతున్నానన్న రేణు
- వాటిని ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకుంటున్నానని వెల్లడి
- యోగా చేస్తున్నానన్న రేణు
తనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, మందులను వాడుతున్నానని, యోగా చేస్తున్నానని చెప్పారు. మంచి పోషక పదార్ధాలను ఆహారంగా తీసుకుంటున్నానని తెలిపారు. తనలా ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకే ఈ విషయాన్ని పోస్ట్ చేస్తున్నానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని షూటింగుల్లో పాల్గొంటానని తెలిపారు. అయితే కచ్చితంగా ఏ విధమైన అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారనే విషయాన్ని మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు.