రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ ఫైర్.. కేసు నమోదు చేయాలని డిమాండ్
- ప్రగతి భవన్ ను పేల్చేయాలన్న రేవంత్ పై కేఏ పాల్ ఫైర్
- రేవంత్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
- టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వ్యాఖ్య
ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై కూడా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి పాత సెక్రటేరియట్ ను కూల్చేశారని... రూ. 610 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించారని... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. కొత్త సచివాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీబీఐకి ఫిర్యాదు చేశానని తెలిపారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పుట్టినరోజునే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి... కేసీఆర్ పుట్టినరోజున దాన్ని ప్రారంభించడం సరికాదని అన్నారు.