నా మానసిక ఆరోగ్యం బాగానే ఉంది: శ్రుతిహాసన్
- ఆరోగ్యం పట్ల ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటానన్న శ్రుతి
- వైరల్ ఫీవర్ వల్లే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని వెల్లడి
- ఆ అభిప్రాయం నుంచి బయటకు రండంటూ సూచన
దీంతో మానసిక అనారోగ్యం వల్లే కార్యక్రమానికి డుమ్మా కొట్టిందంటూ పుకార్లు వచ్చాయి. ఈ దుష్ప్రచారంపై శ్రుతిహాసన్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఘాటుగా స్పందించింది. తనకు వైరల్ ఫీవర్ ఉండడం వల్లే వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని ఆమె స్పష్టం చేసింది. తాను ఎప్పుడూ మానసికంగా ఆరోగ్యంగానే ఉంటానని స్పష్టం చేసింది. తాను ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటానని పేర్కొంది. ‘‘మీరు ఈ అభిప్రాయం నుంచి బయటకు రండి. లేదంటే థెరపిస్ట్ ను సంప్రదించండి’’ అని తన పట్ల తెలిసీ, తెలియకుండా మాట్లాడే వారికి గట్టి బదులు ఇచ్చింది.