కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- 6 నెలల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రవీణ్
- ఈడీ, ఐటీ సోదాలు బీజేపీ, టీఆర్ఎస్ ల డ్రామాలని కామెంట్
- జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్
52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 26 నుంచి పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతికి పంపుతామని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.