అల్లు శిరీష్ తో డేటింగ్ చేస్తున్నాననే వార్తలు విని.. మా అమ్మ చాలా బాధపడింది: అను ఇమ్మాన్యుయేల్
- 'ఊర్వశివో రాక్షసివో' చిత్రంలో నటించిన శిరీష్, అను
- నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం కామన్ అన్న అను
- ఇలాంటి వార్తలను పట్టించుకోనని వ్యాఖ్య
ఈ వార్తలపై అను స్పందిస్తూ... నటీనటులపై ఇలాంటి వార్తలు రావడంలో ఆశ్చర్యం లేదని చెప్పింది. ఇలాంటి అసత్యపు వార్తలను తాను పట్టించుకోబోనని తెలిపింది. అయితే, ఈ వార్తలను విని తన తల్లి ఎంతో బాధపడిందని చెప్పింది. మరోవైపు, ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత శిరీష్, అనుల ఖాతాలో ఒక హిట్ పడింది. ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు.