పోతురాజు ఆటతో ఆకట్టుకున్న రాహుల్ గాంధీ
- సంగారెడ్డిలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
- ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ కు ఘన స్వాగతం
- పోతురాజుల కొరడాతో సందడి చేసిన రాహుల్
ఉదయం చిన్న పిల్లలతో కాసేపు కరాటే ఆడిన ఆయన.. తనకు స్వాగతం పలికిన గిరిజన నృత్యకారులతో కాలు కదిపారు. అలాగే, బోనాల ముంగిట పోతురాజుల విన్యాసం కూడా రాహుల్ చూశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతకు వివరించారు. జగ్గారెడ్డి పోతురాజు ఆట ఆడారు. ఎలా కొరడా ఝుళిపించాలో చెప్పారు. దాంతో రాహుల్ కూడా కొరడా తీసుకొని పోతురాజు ఆట ఆడారు. ఆయన కొరడా కొట్టుకోవడంతో ఆ ప్రాంతంలోని కార్యకర్తల అరుపులు, కేరింతలతో దద్దరిల్లింది.