చీకోటి ప్రవీణ్‌కు భద్రత కల్పించండి... హైదరాబాద్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
- అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ ప్రవీణ్‌పై ఆరోపణలు
- ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన ప్రవీణ్
- తనకు భద్రత కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైనం
- గురువారం ప్రవీణ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు
- వారంలోగా ప్రవీణ్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశం
విచారణలో భాగంగా పలువురు రాజకీయ నేతల పేర్లను తాను ఈడీ అధికారులకు వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయని, ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ ప్రవీణ్ ఈ నెల 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రవీణ్ విజ్ఞప్తిని వారంలోగా పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.