ఒకరోజు ఆలస్యంగా రానున్న 'కార్తికేయ 2'
- నిఖిల్ హీరోగా రూపొందిన 'కార్తికేయ 2'
- కథానాయికగా నటించిన అనుపమ
- కీలకమైన పాత్రను పోషించిన అనుపమ్ ఖేర్
- ఈ నెల 13వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అంటే ముందుగా అనుకున్న తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా థియేటర్లకు ఈ సినిమా రానుందన్నమాట.
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరగనుంది. గతంలో వచ్చిన సినిమాకి కొనసాగింపుగానే ఈ సినిమా నడవనుంది. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించాడు. ముఖ్యమైన పాత్రల్లో ఆదిత్య మీనన్ .. శ్రీనివాస రెడ్డి కనిపించనున్నారు.