జీతాలు ఇవ్వలేక కేసీఆర్ ప్రభుత్వం చతికిల పడటం దేనికి సంకేతం?: ప్రవీణ్ కుమార్
- 12వ తేదీ వచ్చినా సగం జిల్లాల్లో జీతాలు పడలేదన్న ప్రవీణ్
- ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది ఎవరని ప్రశ్న
- ఈ దోపిడీ దొంగలను ఏం చేద్దామన్న ప్రవీణ్ కుమార్
12వ తేదీ వచ్చినప్పటికీ సగం జిల్లాలలో ఉద్యోగులకు జీతాలను ఇవ్వలేక కేసీఆర్ ప్రభుత్వం చతికిలపడటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అయిన మన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది ఎవరని ప్రశ్నించారు. మన డబ్బులు ఎవరి వాస్తులకు, దోస్తులకు, దావత్ లకు ఖర్చు చేశారని అడిగారు. ఈ దోపిడీ దొంగలను ఏం చేద్దామని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీనికి తోడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.