మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు... ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
- 15వ రౌండ్‌కే 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన విక్రమ్ రెడ్డి
- మొత్తంగా 82,888 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
- డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 1,37,081 ఓట్లు పోల్ కాగా... వాటిలో మేకపాటి విక్రమ్ రెడ్డి 1,02,074 ఓట్లను సాధించారు. 15వ రౌండ్ పూర్తి అయ్యే సరికే మొత్తం పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లను దక్కించుకున్న విక్రమ్ రెడ్డి అప్పటికే తన విక్టరీని ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత 5 రౌండ్లు ఆయనకు దక్కిన మెజారిటీని తేల్చేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఈ ఎన్నికలో ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ రెడ్డి విజయం సాధించారు.