ఇది అన్యాయపు నిర్ణయం... పెంచిన విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి: రేవంత్ రెడ్డి
- విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపు
- తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు
- విద్యార్థుల పాలిట పిడుగుపాటు అన్న రేవంత్
- మరే రాష్ట్రంలో ఇలా పెంచలేదన్న కోమటిరెడ్డి
అటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ... ఛార్జీలను పెంచాలని ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఈ రీతిలో భారీగా పెంచడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ఆర్టీసీ వెంటనే వెనక్కి తీసుకోవాలని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.