నడ్డా నేతృత్వంలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీ... పొత్తులపై పవన్ వ్యాఖ్యలపై కీలక చర్చ
- ఏపీ పర్యటనలో జేపీ నడ్డా
- విజయవాడలో పార్టీ ఏపీ కోర్ కమిటీ సమావేశం
- పార్టీ ఎంపీలు టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్ హాజరు
- హాజరైన వీర్రాజు, కన్నా, పురందేశ్వరి, జీవీఎల్
ఈ సమావేశానికి పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటుగా పార్టీ ఎంపీలు టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, కీలక నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా వైసీపీ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చ జరిగిందని తెలుస్తోంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలతో పొత్తుల దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.