డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ శాశ్వత నిషేధం తప్పే: మాజీ సీఈవో జాక్ డోర్సీ సంచలన వ్యాఖ్యలు
- ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం ‘వ్యాపార నిర్ణయం’ అన్న డోర్సీ
- అలా చేసి ఉండకూడదని వ్యాఖ్యలు
- ట్విట్టర్ తన నిర్ణయాలను పునఃసమీక్షించుకుంటూ ఉండాలని సూచన
ట్విట్టర్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు డోర్సీ స్పందిస్తూ.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించడం ‘వ్యాపార నిర్ణయం’ అని, అలా చేసి ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ తన నిర్ణయాన్ని ఎప్పుడూ పునఃసమీక్షించుకుంటూ ఉండాలని, అవసరమైన విధంగా అభివృద్ధి చెందుతూ ఉండాలని అభిప్రాయపడ్డారు.
శాశ్వత నిషేధాలు కంపెనీ వైఫల్యానికి నిదర్శనమని, అవెప్పుడూ పనిచేయవని అన్నారు. చట్టవిరుద్ధమైన ప్రవర్తన, స్పామ్, లేదంటే నెట్‌వర్క్ మానిప్యులేషన్ వంటి వాటితో ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే శాశ్వత నిషేధం విధించాలని డోర్సీ చెప్పుకొచ్చారు.