కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహా 37 మందిపై చార్జ్‌షీట్
- గతేడాది జనవరి 5న ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్
- అఖిలప్రియ, ఆమె భర్త, సోదరులను సూత్రధారులుగా గుర్తించిన పోలీసులు
- అందరూ అరెస్ట్.. ఆపై విడుదల
- త్వరలోనే కేసు విచారణకు వచ్చే అవకాశం
అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలిస్తున్న సమయంలో కిడ్నాప్ చేసిన ముగ్గురినీ ఆ తర్వాతి రోజు దుండగులు వదిలిపెట్టేశారు. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్‌విఖ్యాతరెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీనుకు సంబంధాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు తొలుత అఖిలప్రియను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత మిగతా నిందితులనూ పట్టుకున్నారు. అనంతరం వీరంతా బెయిలుపై విడుదలయ్యారు. కాగా, పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను న్యాయస్థానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.