మరో కొత్త దర్శకుడితో అల్లరి నరేశ్!
- ఆగిపోయిన 'సభకు నమస్కారం'
- కొత్త ప్రాజెక్టుకు అల్లరి నరేశ్ గ్రీన్ సిగ్నల్
- దర్శకుడిగా రాజ్ మోహన్ పరిచయం
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
అయితే మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో అల్లరి నరేశ్ మరో సినిమాను మొదలెట్టేశాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా రాజ్ మోహన్ పరిచయమవుతున్నాడు.
అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. తెలుగు అమ్మాయి అయిన ఆనంది, తమిళంలో బాగా పాప్యులర్ అయింది. 'శ్రీదేవి సోడా సెంటర్' తరువాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇదే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.