మలయాళ హీరోయిన్ పై అత్యాచారం కేసు.. పోలీసుల విచారణకు హాజరైన హీరో
- క్రైం బ్రాంచ్ ఎదుట దిలీప్ హాజరు
- అతడి సోదరుడు, బావలపైనా విచారణ
- విచారణాధికారులను బెదిరించారని ఆరోపణ
2017 ఫిబ్రవరి 17న మలయాళ హీరోయిన్ ను కిడ్నాప్ చేసి కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులను బెదిరించేందుకు దిలీప్ కుట్ర పన్నాడంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతడిపై ఓ విచారణాధికారి ఫిర్యాదు చేశారు. జనవరి 9న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే దిలీప్ ఇప్పుడు విచారణకు హాజరయ్యాడు.