Esha Rebba: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Esha Rebba shakes a leg with Raviteja

  • రవితేజతో ఈషా స్పెషల్ సాంగ్ 
  • ఓటీటీకి వస్తున్న అఖిల్ సినిమా
  • 'స్కైల్యాబ్' విడుదలకు డేట్ ఖరారు  

*  రవితేజ సరసన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా ఆడిపాడనుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ లో ఓ స్పెషల్ సాంగులో రవితేజకు జంటగా ఈషా రెబ్బా నటించనున్నట్టు తెలుస్తోంది.
*  అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి డేట్ నిర్ణయించారు. నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీ లలో ఈ నెల 19 నుంచి దీనిని స్ట్రీమింగ్ చేస్తారు.  
*  నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటించిన 'స్కైల్యాబ్' చిత్రాన్ని డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. నూతన దర్శకుడు విష్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాలుగు దశాబ్దాల క్రితం ఎంతో అలజడి రేపిన అమెరికా స్పెస్ ష్టేషన్ 'స్కైల్యాబ్' నేపథ్యంలో రూపొందింది.

  • Loading...

More Telugu News