'అన్నాత్తే' నుంచి ట్రైలర్ రిలీజ్!
- రజనీ నుంచి రానున్న 'అన్నాత్తే'
- తెలుగు టైటిల్ గా 'పెద్దన్న'
- చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
- ముగ్గురు సీనియర్ హీరోయిన్ల సందడి
సిస్టర్ సెంటిమెంట్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. విలన్స్ కాలుదువ్వడం .. రజనీ సవాల్ చేయడం వంటివి ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో .. ఊరికి పెద్దగా .. ఊరు కోసం పోరాడే ధీరుడిగా రజనీ కనిపిస్తున్నాడు.
జగపతిబాబు మాస్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఆయన పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. రజనీ సరసన నాయికగా నయనతార .. ఇతర ముఖ్య పాత్రల్లో ఖుష్బూ .. మీనా .. ప్రకాశ్ రాజ్ .. కీర్తి సురేశ్ కనిపిస్తున్నారు. తెలుగులో 'పెద్దన్న' టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.