ఆ ఫొటో చూసి.. హీరోయిన్ రెజీనాపై నెటిజన్ల విమర్శలు!
- హీరోయిన్ చేతిలో ప్రముఖ కంపెనీకి చెందిన విస్కీ బ్రాండ్
- ప్రచారంలో భాగంగా పట్టుకున్న రెజీనా
- ఇటువంటి యాడ్ ఎందుకు చేస్తున్నావంటూ విమర్శలు
- అన్‌ఫాలో అవుతామన్న కామెంట్లు
తన ప్రయాణం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని, ఈ మధురక్షణాలను మద్యంతో సెలబ్రేట్ చేసుకుంటానని ఆమె ఆ బ్రాండ్ పేరు చెప్పింది. దీంతో ఇటువంటి యాడ్ ఎందుకు చేస్తున్నావంటూ ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెను సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవుతామని కొందరు కామెంట్లు చేశారు.
కాగా, ఇటీవలే అమితాబ్ బచ్చన్, మహేశ్ బాబు వంటి కొందరు సినీనటులు పొగాకు ఉత్పత్తుల యాడ్స్ లో కనపడ్డారు. దీంతో వారిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అమితాబ్ బచ్చన్ ఆ యాడ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.