ఆసక్తికరంగా 'గూడుపుఠాణి' ట్రైలర్!
- సప్తగిరి హీరోగా 'గూడుపుఠాణి'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా నేహా సోలంకి పరిచయం
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
శ్రీనివాస రెడ్డి - రమేశ్ యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, కె. ఎమ్. కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నేహా సోలంకి కథానాయికగా పరిచయమవుతోంది. కుంచె రఘు విలన్ గా నటించిన ఈ సినిమా నుంచి నిన్న రాత్రి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
గ్రామీణ నేపథ్యంలో ఒక ప్రేమజంట చుట్టూ తిగిగే కథ ఇది. ఆ గ్రామంలో ప్రతినాయకుడి కారణంగా వాళ్లకి ఎదురయ్యే అవరోధాలు .. వాళ్లు ఎలా అధిగమించారనేదే ఈ కథ. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.