'మాస్ట్రో' నుంచి లిరికల్ వీడియో రిలీజ్!
- నితిన్ నుంచి రానున్న 'మాస్ట్రో'
- డిస్నీ హాట్ స్టార్ కి స్ట్రీమింగ్ హక్కులు
- ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్
- కీలక పాత్రలో తమన్నా
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. "హార్టెమో కొట్టుకుంది గోడకి .. వేలాడుతున్నా గడియారంలా .. " అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ కట్టిన ఈ బాణీ కొత్తగా అనిపిస్తోంది. కథలో సందర్భానుసారం వచ్చినప్పుడు ఈ పాట ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువ.
కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. నికిత రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. ఈ ఏడాది నితిన్ చేసిన 'చెక్' .. 'రంగ్ దే' థియేటర్లకు రాగా, 'మాస్ట్రో' డిస్నీ హాట్ స్టార్ లో రానుంది. ఈ సినిమాపై నితిన్ బలమైన నమ్మకంతో ఉన్నాడు.