విశాల్ నుంచి మరో భారీ యాక్షన్ మూవీ!
- విశాల్ నుంచి 32వ సినిమా
- యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా సునైన
- పాన్ ఇండియా స్థాయిలో విడుదల
ఆయన తాజా చిత్రం కూడా యాక్షన్ కి పెద్దపీట వేస్తూ సాగనుంది. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మొన్న విశాల్ పుట్టినరోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆ తరువాత రోజునే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా రిలీజ్ చేశారు.
రమణ - నంద కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన నాయికగా సునైన అలరించనుంది. దిలీప్ సుబ్బరాయన్ ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అన్ని భాషల్లో ఒకటే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.