'కుడి ఎడమైతే' సిరీస్ నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్!
- వెబ్ సిరీస్ గా 'కుడి ఎడమైతే'
- ప్రధానమైన పాత్రలో అమలా పాల్
- కీలకమైన పాత్రలో రాహుల్ విజయ్
- ఈ నెల 16 నుంచి 'ఆహా'లో
అమలా పాల్ ఒక పోలీస్ ఆఫీసర్ .. రాహుల్ విజయ్ ఒక డెలివరీ బాయ్. ఈ ఇద్దరూ ఎవరి పనులపై వారు వెళుతూ ఉండగా, యాక్సిడెంట్ జరుగుతుంది. ఇద్దరూ కూడా ఆ ప్రమాదంలో గాయపడతారు. 'లూసియా యు టర్న్' (తెలుగు యు టర్న్) ను తెరకెక్కించిన దర్శకుడి నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అమలా పాల్ నటన ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా నిలిచేలా అనిపిస్తోంది.