హద్దులు దాటడం మంచిది కాదు.. రైతులకు హర్యానా సీఎం హెచ్చరిక
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
- ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు
- స్థానిక బీజేపీ నాయకులు, రైతుల మధ్య ఘర్షణ
- నేతలు సంయమనం పాటిస్తున్నారన్న ఖట్టర్
- నేతల పర్యటనను అడ్డుకోవడంపై ఆగ్రహం
రైతు అనే పదం చాలా స్వచ్ఛమైందని.. ప్రతిఒక్కరూ అన్నదాతల్ని గౌరవిస్తారని ఖట్టర్ అన్నారు. కానీ, కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల రైతు అనే పదానికి ఉన్న గౌరవం పోతోందన్నారు. నిరసనల ముసుగులో మహిళల గౌరవం మసకబారుతోందన్నారు. హత్యలు జరుగుతున్నాయన్నారు. రోడ్లను నిర్బంధిస్తున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనలను ఖండిస్తున్నానన్నారు.
గ్రామాల్లో పర్యటనకు వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకోవడంపై ఖట్టర్ అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారికి ప్రజలను కలవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిని కూడా గ్రామాల్లో పర్యటించేందుకు అనుమతించబోమని అనడం ఏమాత్రం సరి కాదన్నారు.