అలీ కోసం రంగంలోకి ప్రభాస్!
- నిర్మాతగా మారిన అలీ
- సొంత బ్యానర్లో తొలి సినిమా
- ప్రభాస్ చేతుల మీదుగా లిరికల్ వీడియో
- రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్
అలా ఇప్పుడు ఆయన అలీ నిర్మించిన 'అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి' అనే సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నాడు. రేపు (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు ప్రభాస్ ఈ లిరికల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నాడు. 'అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ ను ఏర్పాటు చేసి, అలీ నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, సీనియర్ నరేశ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. హాస్యనటుడిగా రాణించిన అలీ .. నిర్మాతగా ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి మరి.