'థ్యాంక్యూ' సినిమా నుంచి రానున్న ఫస్టులుక్!
- విడుదలకు సిద్ధమైన 'లవ్ స్టోరీ'
- ముగింపు దశలో 'థ్యాంక్యూ'
- చైతూ జోడీగా ముగ్గురు హీరోయిన్లు
- ఫస్టులుక్ రిలీజ్ చేసే ఆలోచన
నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రాశి ఖన్నా కనువిందు చేయనుంది. ఇక మాళవిక నాయర్ .. అవికా గోర్ కూడా కథానాయికలుగానే కనిపించనున్నారు. అంటే ఈ సినిమాలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారన్న మాట.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సెలవుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ లోగా చైతూ హీరోగా చేసిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.