సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వెబ్ సీరీస్ పై దృష్టి పెట్టిన తమన్నా
- పూరి జగన్నాథ్ కు మరో ఆఫర్
- 'ఆదిపురుష్'కి సంగీత దర్శకద్వయం
* విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పూరి పనితనం, సినిమా అవుట్ ఫుట్ బాగా నచ్చడంతో తన బ్యానర్లో మరో సినిమా చేయమని పూరి జగన్నాథ్ కు కరణ్ జొహార్ మరో ఆఫర్ ఇచ్చాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
* ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రానికి సంగీత దర్శకులుగా బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం సాచేత్ టాండన్-పరంపర ఠాకూర్ లను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే!