నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్!
- వైజయంతీ మూవీస్ తో నందినీ రెడ్డి
- చైతూతో అనుకున్న సినిమా వాయిదా
- ముందుకు వచ్చిన సంతోష్ శోభన్ ప్రాజెక్టు
వైజయంతీ మూవీస్ బ్యానర్లో ముందుగా ఆమె నాగచైతన్యతో ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం చైతూ చాలా బిజీగా ఉన్నాడు. అందువలన సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమా చేయడానికి ఆమె రంగంలోకి దిగారు. 'తను నేను' .. 'పేపర్ బాయ్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్, రీసెంట్ గా 'ఏక్ మినీ కథ'లో నటించాడు. యూత్ లో ఈ కుర్రాడికి క్రేజ్ పెరిగింది. ఆ తరువాత సినిమాను అతను నందినీ రెడ్డి దర్శకత్వంలోనే చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.