తమిళ అగ్రహీరో సరసన కీర్తి సురేశ్?
- విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమా
- పాన్ ఇండియా స్థాయి సినిమా
- కీర్తి సురేశ్ తో ప్రస్తుతం సంప్రదింపులు
- దిల్ రాజు బ్యానర్లో నిర్మాణం
ఈ క్రమంలో తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ని ఎంచుకున్నట్టు, ప్రస్తుతం చిత్ర బృందం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇది కనుక ఖరారైతే కథానాయికగా కీర్తి సురేశ్ స్థాయి మరో మెట్టు ఎక్కుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.