ఆనంద్ దేవరకొండ హీరోగా 'హైవే' మూవీ ప్రారంభం!
- సీనియర్ సినిమాటోగ్రాఫర్ గా గుహన్ కు పేరు
- దర్శకుడిగా గుహన్ తొలి సినిమా '118'
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- త్వరలో మిగతా వివరాలు
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాకి 'గుహన్' దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీఐశ్వర్యలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొంత సేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆనంద్ దేవరకొండపై ఎమ్మెల్యే జి. కిషోర్ కుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వీరభద్రం ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. గుహన్ .. సీనియర్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో '118' సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన ఆయన, ఆ తరువాత చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ కంటెంట్ ను తెరపై ఆయన ఒక రేంజ్ లో ఆవిష్కరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.