టాలీవుడ్ డైరెక్టర్ తో విజయ్ మూవీ!
- వరుస హిట్లతో విజయ్
- సెట్స్ పై 65వ సినిమా
- దిల్ రాజు నిర్మాణంలో కొత్త ప్రాజెక్టు
ఈ నేపథ్యంలోనే విజయ్ ఓ టాలీవుడ్ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ... వంశీ పైడిపల్లి. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరంచనున్నది దిల్ రాజు అనేది మరో విశేషం. విజయ్ సినిమాలు తెలుగులోకి విడుదల కావడంలో దిల్ రాజు పాత్ర ముఖ్యమైనది. అందువలన ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీ పైడిపల్లి దగ్గర ఉన్న ఒక కథను విజయ్ కి వినిపించిన దిల్ రాజు, విజయ్ తో ఓకే అనిపించాడని చెప్పుకుంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఇందులో వాస్తవమెంతుందో!