'ఈగ' సుదీప్ తో 'సాహో' దర్శకుడి ప్రాజక్ట్?
- ప్రభాస్ తో 'సాహో' సినిమా చేసిన సుజీత్
- ఇటీవల సుదీప్ కి కథ చెప్పిన వైనం
- నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిన సుదీప్
- యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా నిర్మాణం
ఆమధ్య ప్రభాస్ హీరోగా 'సాహో' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సుజీత్ మంచి టెక్నీషియన్ గా పేరుతెచ్చుకున్నారు. 'సాహో' సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించకపోయినప్పటికీ, దర్శకుడిగా సుజీత్ టేకింగుకి మంచి పేరు వచ్చింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు.
ఈ క్రమంలో ఇటీవల సుదీప్ ని కలసి సుజీత్ ఓ కథ వినిపించాడని, అది ఆయనకు బాగా నచ్చిందనీ అంటున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగే ఈ చిత్రంలో నటించడానికి సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ, బెంగళూరులో షూటింగ్ జరుగుతుందనీ సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.