శివ కార్తికేయన్ తో ఒక డీల్ కుదుర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్
- కరోనా తర్వాత దూకుడు పెంచిన రకుల్
- 'అయలాన్'లో శివకార్తికేయన్ తో కలిసి నటించిన పంజాబీ భామ
- కార్తికేయన్ తో కలిసి నటించడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్య
కార్తికేయన్ తో కలసి నటించడం సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఆయన చాలా మంచి యాక్టర్ అని కితాబునిచ్చింది. డైలాగ్స్ ను తమిళంలో ఎలా పలకాలో తనకు నేర్పించాడని చెప్పింది. తనకు కావాల్సిన ఆహారం చెన్నైలో ఎక్కడ దొరుకుతుందో చెప్పేవాడని తెలిపింది. షూటింగ్ సమయంలో ఆయనతో ఒక డీల్ కుదుర్చుకున్నానని... సెట్స్ లో ఉన్నంత కాలం తనతో ఆయన ఇంగ్లిష్ లో మాట్లాడాలి... ఆయనతో తాను తమిళంలో మాట్లాడాలనేదే ఆ డీల్ అని చెప్పింది. ప్రస్తుతం రకుల్ చేతిలో 7 సినిమాలు ఉన్నాయి.