శశికళ విడుదలైతే ఏంటి?: తమిళనాడు మంత్రి జయకుమార్
- త్వరలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ
- ఆమె వెంట ఎవరూ వెళ్లబోరన్న మంత్రి
- పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
శశికళ, ఆమె బంధువులు, మద్దతుదారుల ప్రమేయం లేకుండానే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని జయకుమార్ తెలిపారు. శశికళ కుటుంబం వద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయని, ఆ సొమ్ముతో కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే, శశికళ వెంట పార్టీ నేతలు ఎవరూ వెళ్లే అవకాశం లేదని తెగేసి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై మాత్రం వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు.