అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర కన్నుమూత!
- 1924లో అల్లూరికి సేవలందించిన బాలుదొర
- 111 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత
- నివాళులు అర్పించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు
అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు.