చిరంజీవిని సీఎం చేయడమే వీర్రాజు లక్ష్యం.. కాపులను రెచ్చగొడుతున్నారు: హర్షకుమార్
- జనసేన కులాభిమానంతో, బీజేపీ మతాభిమానంతో కుళ్లిపోయాయి
- సోము వీర్రాజుకు కులాభిమానం చాలా ఎక్కువ
- చిరంజీవి కుటుంబానికి హనుమంతుడిలా మారిపోయారు
జనసేన కులాభిమానంతో, బీజేపీ మతాభిమానంతో కుళ్లిపోయాయని హర్షకుమార్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు కులాభిమానం చాలా ఎక్కువని, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడమే ఆయన లక్ష్యమని... చిరంజీవి కుటుంబానికి హనుమంతుడిలా మారిపోయారని చెప్పారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కోలా జగన్ నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను ఒకేలా చూడరని విమర్శించారు. రథం ఘటనను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన జగన్... దళిత యువకుడికి శిరోముండనం కేసును సీబీఐ చేత ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. దళితులపై జగన్ కు చిత్తశుద్ధి ఉంటే... శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.