నేను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే.. చేసుకోకపోయినా ఇబ్బందే: రేణు దేశాయ్
- పెళ్లి ప్రశ్నలతో విసిగిపోయా
- వీటికి సమాధానంగా ఒక సినిమా తీస్తా
- దానికి 'పెళ్లి గోల' అనే టైటిల్ పెడతా
తాజాగా ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన ఆమెకు... ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమెకు అవే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆమె ఫన్నీగా సమాధానం చెప్పారు. అందరూ తన పెళ్లి గురించే అడుగుతున్నారని... తాను పెళ్లి చేసుకున్నా వారికి ఇబ్బందేనని, పెళ్లి చేసుకోకపోయినా ఇబ్బందేనని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్నలతో తాను విసిగిపోయానని చెప్పారు. వీటన్నింటికీ ఒక సమాధానంగా ఒక సినిమా తీస్తానని... దానికి 'పెళ్లి గోల' అనే టైటిల్ పెడతానని అన్నారు.