నాలుగు నెలలుగా కట్టని ఇంటి అద్దె.. రెట్టించి అడిగాడని యజమాని హత్య
- చెన్నైలోని కుండ్రటూరులో ఘటన
- అద్దె చెల్లించాల్సిందేనని పట్టుబట్టిన ఇంటి యజమాని
- కోపం పట్టలేక అర్ధరాత్రి కత్తితో దాడిచేసి చంపేసిన అద్దెదారు కొడుకు
తాజాగా, అద్దె కోసం ధనరాజ్‌పై గుణశేఖర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపం పట్టలేకపోయిన ధనరాజ్ కుమారుడు అజిత్ అర్ధరాత్రి వేళ గుణశేఖర్ ఇంటికి వెళ్లి అతడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.