సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సీక్వెల్ నుంచి తప్పుకున్న అనుపమ
- మాజీ ప్రేమజంట నటించడం లేదట!
- వెబ్ సీరీస్ లోకి ప్రముఖ దర్శకుడు
* ఒకప్పటి ప్రేమజంట ప్రభుదేవా, నయనతార కలసి మళ్లీ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను తమిళ చిత్ర నిర్మాత ఇషారి గణేశ్ ఖండించారు. వీరిద్దరి కాంబినేషన్ లోనూ తాను చిత్రం నిర్మిస్తున్నట్టు వార్తలొస్తున్నాయనీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తేల్చిచెప్పారు.
* ప్రముఖ దర్శకుడు మణిరత్నం వెబ్ సీరీస్ ను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. తాను నిర్మాతగా వుండి, దర్శకత్వ బాధ్యతలను మాత్రం వేరే వారికి అప్పగిస్తారట. కాగా, ప్రస్తుతం మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీని తర్వాత 'రోజా' సీక్వెల్ చేస్తారు.