సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఎన్టీఆర్ సరసన మరోసారి సమంత
- బాలకృష్ణ నిర్ణయం కోసం వెయిటింగ్
- యువ దర్శకుడికి చరణ్ ఛాన్స్
* మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన పాత్రను బాలకృష్ణతో చేయించాలని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ భావిస్తోంది. అయితే, బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆయన మలయాళ సినిమాను చూశాక ఏ నిర్ణయం చెబుతారని అంటున్నారు. మరో పాత్రకు గాను రానా, రవితేజ పేర్లు వినిపిస్తున్నాయి.
* 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రాల తర్వాత రాంచరణ్ నటించే చిత్రం ఇంకా ఏదీ కన్ ఫర్మ్ కాలేదు. పలువురు దర్శకులు ఆయనకు కథలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో 'జెర్సీ', 'మళ్లీ రావా' వంటి చిత్రాలను రూపొందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ తదుపరి సినిమా ఉండచ్చని వార్తలు వస్తున్నాయి.