'ఏ 1 ఎక్స్ ప్రెస్' పై చాలా ఆశలు పెట్టుకున్నాను: హీరో సందీప్ కిషన్
- 'ఏ 1 ఎక్స్ ప్రెస్ ' చివరిదశకు చేరుకుంది
- తొలిసారిగా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాను
- లైన్లో రెండు కొత్త ప్రాజెక్టులు వున్నాయన్న సందీప్
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా షూటింగును అనుకున్న ప్రకారమే చేస్తూ వచ్చాము. ఇంకా 10 రోజుల పాటు చిత్రీకరణ జరగవలసి వుంది. లాక్ డౌన్ తరువాత తిరిగి షూటింగ్ మొదలవుతుంది. మొదటిసారిగా ఈ సినిమాలో నేను సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాను. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ చూసిన తరువాత ఈ సినిమాపై నాకున్న నమ్మకం మరింత పెరిగింది. నా జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపించనున్నారు. లాక్ డౌన్ తరువాత రెండు కొత్త ప్రాజెక్టులను గురించి చెబుతాను" అని అన్నాడు.