Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మంచి మనసు చాటుకున్న తమన్నా 
  • కొరటాల సినిమాలో యంగ్ హీరో
  • మెరుగులు దిద్దుతున్న త్రివిక్రమ్
Tamanna helps migrated labour in Mumbai

*  అందాలతార తమన్నా తన అందమైన మనసును కూడా చాటుకుంటోంది. ఇప్పటికే టాలీవుడ్ కార్మికుల సహాయార్థం సీసీసీకి మూడు లక్షల విరాళం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా ముంబైలోని 'లెట్స్ ఆల్ హెల్ప్' అనే ఎన్జీవోతో కలిసి లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న వలస కార్మికులకు పెద్ద ఎత్తున ఆహారాన్ని, నిత్యావసర సరుకులను సరఫరా చేస్తోంది.
*  ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని కొత్తతరం హీరోతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో నాని కానీ, విజయ్ దేవరకొండ కానీ ఆ చిత్రంలో హీరోగా నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
*  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనిలో ఆయన బిజీగా ఉన్నాడనీ, తుది మెరుగులు దిద్దుతున్నాడని చెబుతున్నారు.

More Telugu News