కన్నడలోకి రీమేక్ అవుతున్న 'ఎవరు'
- తెలుగులో హిట్ కొట్టిన 'ఎవరు'
- అడివి శేష్ పాత్రలో దిగంత్
- 'మేజర్' చేస్తున్న అడివి శేష్
తెలుగులో అడివి శేష్ పోషించిన పాత్రను కన్నడలో 'దిగంత్' చేయనున్నాడు. ఇక రెజీనా పాత్రకి ఎవరిని ఎంపిక చేయనున్నారనేది చూడాలి. తెలుగు సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే కన్నడ సినిమాకి కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో విజయాన్ని అందుకున్న ఈ కథ, కన్నడలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఇక అడివి శేష్ విషయానికొస్తే, మహేశ్ బాబు నిర్మాణంలో ఆయన 'మేజర్' సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.