రాష్ట్రపతిని కలసిన బృందంలో ఎంపీ దుష్యంత్.. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రపతికి ఆరోగ్య పరీక్షలు!
- సింగర్ కనికాకపూర్ ఇచ్చిన విందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ దుష్యంత్
- ‘కరోనా’ సోకిందన్న అనుమానంతో హోం క్వారంటైన్ లో దుష్యంత్
- అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రాష్ట్రపతి
అయితే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఇటీవల కలిసిన బీజేపీ ఎంపీల బృందంలో దుష్యంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్ నాథ్ కోవింద్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం.