ఎస్ఈసీ పేరిట రాసిన లేఖపై డీజీపీకి ఫిర్యాదు.. చంద్రబాబుపై అంబటి ఫైర్
- గౌతమ్ సవాంగ్ ని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
- రమేశ్ కుమార్ ధ్రువీకరించకపోయినా ఆ పత్రికలు ప్రచురించాయి
- రమేశ్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్ర
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒక మనిషి రాసిన రాతలకు ధ్రువీకరణ లేకపోయినా పత్రికలు ప్రచురిస్తాయా? అంటూ ‘ఈనాడు‘, ఆంధ్రజ్యోతి’పై మండిపడ్డారు. సీఎం జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే రమేశ్ కుమార్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ లేఖ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కనుక రాస్తే ధైర్యంగా ఒప్పుకోవాలని అన్నారు. ఈ లేఖపై వాస్తవాలు బయటకొచ్చే వరకూ తాము పోరాడతామని అన్నారు.