నిజంగానే కల్యాణ్ రామ్ పేరు మర్చిపోయా: అనిల్ రావిపూడి
- ప్రీరిలీజ్ వేడుకలో చాలా సంతోషంగా ఉన్నా
- వ్యక్తిగతంగా, వృత్తి పరంగా చాలా ఎమోషనల్ గా ఉన్నా
- కల్యాణ్ రామ్ పేరును మర్చిపోవడం ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు
తన తొలి హీరో కల్యాణ్ రామ్ పేరు చెప్పడం మర్చిపోయానని అనిల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నిన్న చాలా ఎమోషనల్ గా ఉన్నానని చెప్పారు. ప్రీరిలీజ్ వేడుకలో చాలా సంతోషానికి లోనయ్యానని... దీంతో, తన తొలి హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ పేరును చెప్పడం మర్చిపోయానని తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని... నిజంగానే మర్చిపోయానని చెప్పారు. కల్యాణ్ రామ్ తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.