'అశ్వత్థామ' కోసం డబ్బింగ్ చెబుతున్న నాగశౌర్య
- 'అశ్వత్థామ'గా నాగశౌర్య
- సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
- వచ్చేనెల 31వ తేదీన విడుదల
ప్రస్తుతం నాగశౌర్య తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. జనవరి 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కొత్త ఏడాదిలో నాగశౌర్యను హిట్ పలకరిస్తుందేమో చూడాలి.