రేపు పలకరించనున్న 'రూలర్' లిరికల్ సాంగ్
- యాక్షన్ ఎంటర్టైనర్ గా 'రూలర్'
- సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్
- ముఖ్యపాత్రల్లో ప్రకాశ్ రాజ్ - భూమిక
ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'అడుగడుగో యాక్షన్ హీరో' అనే ఫస్టు లిరికల్ వీడియో సాంగును రేపు ఉదయం 11:42 నిమిషాలకి విడుదల చేయనున్నారు. రెండు విభిన్నమైన లుక్స్ తో బాలకృష్ణ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక నటించారు. ప్రకాశ్ రాజ్ .. భూమిక ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలకృష్ణ అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.