'అశ్వద్ధామ' వచ్చేది అప్పుడే
- సొంత బ్యానర్లో నాగశౌర్య సినిమా
- దర్శకుడిగా రమణ తేజ పరిచయం
- ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు
ఊయలలో వున్న పసికందు వేలును పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.