1,400 జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి మాయం చేసేశారు!: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- రూ.500 కోట్లతో కొత్త అసెంబ్లీ ఎందుకు?
- ఆ నిధులను ఆరోగ్యశ్రీ బకాయిలకు ఇవ్వొచ్చుగా
- కేసీఆర్ కాళేశ్వరంలో కమీషన్లు దండుకున్నారు
టీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుని తింటున్నారని దుయ్యబట్టారు. ఉన్న అసెంబ్లీని కూల్చేసి, రూ.500 కోట్లతో కొత్త అసెంబ్లీ కడతామని కేసీఆర్ చెప్పడాన్ని లక్ష్మణ్ తప్పుపట్టారు. ఈ కొత్త సచివాలయానికి బదులుగా ఆ నిధులను ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి వాడొచ్చు కదా అని సూచించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం జారీచేస్తున్న జీవోలను వెబ్ సైట్ లో కనిపించకుండా చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇప్పటివరకూ 5 శాఖలకు సంబంధించి 1,400 జీవోలు కనిపించకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.